Monday, February 21, 2011

తెలుగు కార్టూనిస్టుల కోసం ఫోరం

ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలుగు కార్టూనిస్టుల కోసం ఫోరం ప్రారంభించాము. దయచేసి కార్టూనిస్ట్ గా మీ విజయాలను ఇంకా ఇతర
సమాచారాన్ని తోటి కార్టూనిస్టులతో పంచుకోండి.
కొన్ని ఆసక్తికరమైన లింకుల్ని ఇక్కడ తెలియజేస్తున్నాను:

మహిళా కార్టూనిస్ట్ కుమారి రాగతి పండరి గారికి హంస "కళారత్న" అవార్డ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఓ కార్టూనిస్ట్ కి ఈ అరుదైన పురస్కారం లభించడం నిజంగా మనమందరం గర్వించదగిన విషయం.
ఈ శుభాసంధర్భాని పురస్కరించుకుని కుమారి రాగతి పండరి గారికి అభినందనలు తెలియజేయండి.

అపురూపాలు... ఆయన ప్రాణాలు!



Thalisetti Ramarao Cartoons : తలిశెట్టి రామారావు కార్టూన్స్
( a beautiful collection of more than 100 pages, priced at Rs 80)
is going to hit the stalls. It will be a worthy possession of not only our
telugu cartoonists but also telugu readers all over the world.

Sunday, April 18, 2010

కార్టూనిస్ట్ శ్రీ కాటూరి గారి ఫోటో సంగతులు


















1976 నాటి సంగతి. అప్పుడు నేను 7 తరగతి చదువుతున్నాను.
తెలుగునాట తెలుగు పత్రికలు రాజ్యమేలుతున్న రోజులు.
వారం వారం పత్రికలలో ప్రచురించబడే సీరియల్స్ కోసం ముచ్చటించుకుంటూ,
మళ్లీ వారం పత్రిక కోసం పారకులు ఆసక్తి గా ఎదురుచూసే అందమైన రోజులవి.
రోజుల్లో తెలుగు పత్రిక లేని ఇల్లు వుండేది కాదు అనడంలో అతిశయోక్తి లేదేమో.

మా పెద్దన్నయ్య పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగస్తులందరూ చందాలు కూడగట్టి పత్రికలు కొని గ్రంధాలయం నడిపేవారు.
నా అదృష్టం అనుకుంటాను మా అన్నయ్యే వారం వారం పుస్తకాల దుకాణం లోకి వచ్చే కొన్ని మాస పత్రికలు, మరికొన్నివారపత్రికలు కొని కంపెనీ గ్రంధాలయానికి తీసుకువెళ్ళేవారు.

పుస్తకాలు కొని ఇంటికి తీసుకువచ్చే బాధ్యతని నాకు అప్పగించేవారు.
అప్పట్లో వచ్చే మాస పత్రికలో "యువ", వారపత్రికలలో "ఆంధ్రప్రభ" ని నేను ఎక్కువ ఇష్ట్టపడేవాణ్ణి.
అందుకు కారణం లేకపోలేదు. కథలు, సీరియల్స్ కంటే కార్టూన్లు చదవడాన్కి (చూడడానికి) శ్రద్ధ చూపించేవాణ్ణి.
"యువ" లో ప్రతినెల శ్రీ జయదేవ్ బాబు గారి కార్టూన్లు నాలుగుకంటే ఎక్కువ ఉండేవి.
అలానే ప్రభ లో శ్రీ కాటూరి గారివి కూడా.

ఇంటికి వెళితే మా అన్నయ్య పత్రికలు చదవనీయడనే భయం తో బుక్ షాప్ నుండి నత్త నడక నడుస్తూ ఇంటికిచేరుకునేలోగా చేతిలోవున్న పత్రికలన్నింటిలో కార్టూన్స్ ని చూడడం పూర్తి కానిచ్చేవాణ్ణి.

కాటూరి గారి వ్యంగ్యం, జయదేవ్ బాబు గారి బొమ్మలు తెగ నచ్చేవి.
నాకు తెలియకుండానే నాలో కార్టూన్లు గీసే వాళ్ళ మీద అభిమానం దిన దిన ప్రవర్ధమానము కాసాగింది.
వాళ్లను ఎలాగైనా ఉత్తరాల ద్వారా పలకరించాలనే ఉద్దేశ్యం తో పత్రికలలో వాళ్ళ చిరునామాల కల పేజీలుఉంటాయేమోనని ఆశతో వేదికేవాణ్ణి. కాని ఎప్పుడు నిరాశే ఎదురయ్యేది.

నా ఆశ నెరవేరే రోజు రానే వచ్చింది.
అదేదో పండగ (గుర్తులేదు) సందర్భాన్నీ పురస్కరించుకుని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక వారు నిర్వహించిన కార్టూన్లపోటిలో బహుమతి పొందిన కార్టూన్లని ప్రచురిస్తూ, కార్టూన్ల క్రింద కార్టూనిస్ట్ చిరునామాలు కూడా ప్రచురించారు.
అందులో కాటూరి గారిది కూడా వుండడం తో నేను అనుకున్నది సాదించే మార్గం సుగమనం అయ్యింది.

ఆలస్యం చేయకుండా నా అభిమానం తెలియజేస్తూ, కార్టూన్లు ఎలా గీస్తారు?, ఎలాంటి పేపర్ మీద గీయాలి?, ఇంకుతో సైజులో గీయాలి? లాంటి అర్ధమైన ప్రశ్నలతో పాటు మరికొన్ని అర్ధం లేని పిచ్చి రాతలు జోడించి, ఫోటో కూడా పంపమనిశ్రీ కాటూరి గారికి వుత్తరం రాసి పోస్ట్ బాక్సు లో పారేసాను.

నిరీక్షణ ఎంత మధురంగా ఉంటుందో కాటూరి గారి రిప్లై కోసం ఎదురుచూడడం లో చవిచూసాను.
వారం రోజుల తరువాత శ్రీ కాటూరి గారు నా సందేశాలన్నింటికి సమాధానము తో పాటు నేను కోరిన విధంగా ఫోటోనికూడా జతచేసి రిప్లై వ్రాసారు.

అది నేను జీవితంలో సాదించిన గొప్ప విజయంగా భావించి ఫోటోని, ఉత్తరాన్ని ఇంట్లో అందరికి చూపించుకున్నాను.
శ్రీ కాటూరి గారు వ్రాసిన వుత్తరానైతే ఎక్కడో పారేసుకున్నాను.
కాని ఫోటో మాత్రం ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు పదిలంగా దాచుకోగలిగాను.
ఈనాటికి తెలుగు కార్టూనిస్ట్ మిత్రులతో శ్రీ కాటూరి గారి ఫోటో పంచుకునే అవకాశం కలిగింది.

శ్రీ కాటూరి కృష్ణమూర్తి గారు ఇక మనకు లేరు.
అప్పటిలో ఆయన నివాసముండే వూరు నూతక్కి, గుంటూరు జిల్లా (నేను అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాసే చిరునామా).
ఆయన మనకు దూరంగా సంవత్సరం లో వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి.

శ్రీ కాటూరి కృష్ణమూర్తి గారి ప్రొఫైల్ మరియు కార్టూన్స్ ని దయచేసి దిగువన తెలియజేసిన లింక్ లో చూడగలరు.
శ్రీ కాటూరి కార్టూన్స్ మరియు ప్రొఫైల్

శ్రీ కాటూరి గారు గురించి మీకు తెలిసిన విషయాలని, కార్టూన్లను దయచేసి telugucartoon@gmail.com కిఈమెయిలు చేయగల ప్రార్ధన.

Saturday, April 17, 2010

బ్లాగ్ తెలుగుకార్టూన్ డాట్ కామ్ కి అనుబంధం గా ఉండేందుకు ప్రారంభించబడింది.
తెలుగు కార్టూన్ డాట్ కామ్ లో స్థలభావం వలన పంచుకోలేకపోయిన విషయాలకు ఇక్కడ ప్రాధాన్యత లభిస్తుంది.
తెలుగుకార్టూన్ డాట్ కామ్ తేది 20 డిశంబర్ 2009 హొస్ట్ చేయబడినది. ఏప్రెల్ 2010 నాటికి మొత్తం 50 మందితెలుగు కార్టూని
ష్టుల కార్టూన్లు మరియు ప్రోఫైల్స్ లను తెలుగు కార్టూన్ డాట్ కామ్ సైట్ లో వుంచడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో మరియు ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు కార్టూనిస్టులు తమ
ప్రోఫైల్స్ లను మరియు కార్టూన్స్ ని తెలుగు కార్టూన్ డాట్ కామ్ కి పంపించ గలరు. వివరాలకోసం www.telugucartoon.com సందర్శించగలరు.


తెలుగుకార్టూన్ డాట్ కామ్ హొస్ట్ చేసినప్పటి ఫోటో.
తేది : 20
డిశంబర్ 2009
స్థలం : జలవిహర్, నెక్లెస్ రోడ్, హైదరాబాద్.
ఫోటో లో వెబ్ సైట్ హొస్ట్ చేసిన కార్టూనిస్ట్ శ్రీ మోహన్ గారితోపాటు శ్రీ సత్యమూర్తి, శ్రీ జయదేవ్ బాబు, శ్రీ రామకృష్ణ,
శ్రీ నాగిశెట్టి ఇంకా
తదితరులను చూడగలరు. ఫోటో పెద్దదిగాచూసేందుకు దయచేసి ఫోటో మీద క్లిక్ చేయగలరు.